APPSC: ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు 4 రోజులే గడువు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,220 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “199 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్ లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు.
పోస్టుల వివరాలు…
1.ప్రొఫెసర్ పోస్టులు- 418
2.అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు- 801
3.ట్రిపుల్ ఐటీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- 2,001
మొత్తం పోస్టుల సంఖ్య: 3,220
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్/ పీహెచ్, యూజీసీ/ సీఎస్ఐఆర్/ నెట్/ ఏపీ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2 వేలు ఫీజు చెల్లించాలి.
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “199 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి