AP Outsourcing Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ కడప జిల్లాలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హతలు
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు (Diploma in Computers / PG Diploma in Computers). సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి
25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్పుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు 2025 నవంబర్ 20వ తారీకు లోపు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

