Job Mela: ఈరోజు 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నవంబర్ 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే ప్రాంతాల వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
- 18-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశాలు:
- ప్రకాశం జిల్లా: Government Junior College, Cumbum.
- ప్రకాశం జిల్లా: Government Model Degree College, Yerragondapalem.
- ప్రకాశం జిల్లా: NAC Training Center, O/o. Sericulture Building, Markapur.
- కృష్ణాజిల్లా: Polytechnic College, Gannavaram.
- కృష్ణాజిల్లా: S.B.N.Govt. Junior College, Pedana.
- నెల్లూరు జిల్లా: D.K.Govt. Degree College for Women (A), Opp. Police Parade Ground, Nellore.
- కర్నూలు జిల్లా: Government Degree College, Pattikonda.
- నంద్యాల జిల్లా: Government Degree College, Atmakur.
- నంద్యాల జిల్లా: Government Polytechnic College, Bethamcherla.
- తిరుపతి జిల్లా: ESS Degree College, Cross Roads, Venkatagiri.
- తిరుపతి జిల్లా: Government Degree College for Women, NTR Nagar, Srikalahasti.
- శ్రీ సత్యసాయి జిల్లా: Government Polytechnic College, Hindupur.
- శ్రీకాకుళం జిల్లా: Government Polytechnic College, Gujarathipeta.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి