AP Mega Job Mela 2023: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్వ్యూ ద్వారా 1,405 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 29న విజయనగరం జిల్లాలోని గరివిడి లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 16 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి: Click here
కంపెనీల వివరాలు:
ఫ్లిప్‌కార్ట్, రాండ్‌స్టాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ICICI బ్యాంక్, అపోలో ఫార్మసీ, ATC లాజిస్టిక్స్ & ఎలక్ట్రానిక్స్, NS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా Pvt Ltd., జయభేరి ఆటోమోటివ్స్ Pvt.Ltd, వరుణ్ మోటార్స్, దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రై.లి., హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, సినాప్టిక్స్ ల్యాబ్స్, సునైనా క్రియేషన్స్, YSK ఇన్ఫోటెక్ PVT LTD, ఫస్ట్ సోర్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,405
విద్యార్హతలు:
10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, MBA, MCA… అర్హతల వారికి అవకాశాలు ఉన్నాయి
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల వారు అర్హులు.
జీతభత్యాలు:
పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
29 AUGUST 2023 at 9.00 AM.
డ్రైవ్ నిర్వహణ వేదిక:
Avanthi’s St.Theresa Institute of Engineering and Technology,
Gharbham Road, Garividi,
Vizianagaram District.
జాబ్ లొకేషన్:
విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, పార్వతీపురం, బొబ్బిలి, కడప, శ్రీకాకుళం.. తదితర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
నోటిఫికేషన్ వివరాలు: