AP Job Mela 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 31న అనకాపల్లి జిల్లాలోని రేబాకలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సంస్థలు, పోస్టుల వివరాలు..
డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కంపెనీలో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 30.
విద్యార్హతలు:
డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇంస్ట్రుమెంటేషన్/ కెమికల్) 2022, 2023 లో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 19 నుంచి 21 ఏళ్ల వయసుగల వారు అర్హులు.
జీతభత్యాలు:
2.1 Lakh – PA
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
31 AUGUST 2023 at 9.00 AM.
డ్రైవ్ నిర్వహణ వేదిక:
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రేబాక.
జాబ్ లొకేషన్:
పైడిభీమవరం
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
నోటిఫికేషన్ వివరాలు: