ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత వయస్సు దరఖాస్తు విధానం ఎంపిక విధానం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్: 09 పోస్టులు

విద్యార్హత:

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం:

ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
హార్డ్ కాపీ పంపవలసిన చిరునామా:
The Registrar,
School of Planning and Architecture,
4/4, ITI Road, Vijayawada
Andhra Pradesh- 520008

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!