AP Job Mela: ఆంధ్రప్రదేశ్ 4 జిల్లాల్లో నేడు జాబ్ మేళా నిర్వహణ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఫిబ్రవరి 14వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.
👉ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉విద్యార్హతలు:
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
◆14-02-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
◆ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
◆ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
◆అనంతపురం జిల్లా: Government Polytechnic College, Ferrer Block, JNTU Road, Anantapur.
◆ప్రకాశం జిల్లా: Dr.B.R.Ambedkar Auditorium, Yerragondapalem.
◆నంద్యాల జిల్లా: PSC & KVSC Government Degree College, Nandyal.
◆చిత్తూరు జిల్లా: District Employment Office, Kongareddy Palli, Puttur Road, Chittoor.