ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 4న ముగిసింది.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదల చేసిన తరువాత.. విద్యార్థులందరూ తమ ఫలితాలను http://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చూసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి
