May 12, 2024
AP Govt Jobs

AP గ్రామ సచివాలయం సిలబస్ 2023 | పరీక్ష విధానం, ఎంపిక విధానం

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల 3rd నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో పార్ట్-A, పార్ట్-B అను రెండు పార్టులు ఉంటాయి. ఒక్కో పార్ట్ నుండి 75 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సిలబస్

PART – A

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

1.జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్.
2.డేటా ఇంటర్ ప్రేటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
3.రీడింగ్ కాంప్రహెన్షన్ – తెలుగు & ఇంగ్లీష్.
4.జనరల్ ఇంగ్లీష్.
5.ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
6.ప్రాంతీయ , జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్.
7.జనరల్ సైన్స్ మరియు నిత్యజీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.
8.సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ.

PART – B

1.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి.
2.భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్. 73, 74 రాజ్యాంగ సవరణలు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
3.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక.
4.సమాజం, సామాజిక న్యాయం మరియు హక్కుల సమస్యలు.
5.భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం.
6.ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయంపరమైన చిక్కులు/ సమస్యలు.
7.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు.
8.మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Syllabus in Telugu

Syllabus in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!