Postal Jobs: 10th క్లాస్ అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Poatal Jobs: తపాల శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, కర్ణాటక సర్కిల్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
స్టాఫ్ కార్ డ్రైవర్: 27 పోస్టులు
విద్యార్హతలు:
10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెచ్ఎంవీ)తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు :
నెలకు రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
మేనేజర్,
మెయిల్ మోటార్ సర్వీస్,
బెంగళూరు- 560001.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మే 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని.. పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.