December 6, 2024
All India Govt Jobs

10th అర్హతతో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRC Group D Notification 2024

RRC Recruitment 2024: రైల్వే శాఖలో 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్ రైల్వే నుంచి.. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి సర్టిఫికెట్ తో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు: 38

ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్.

10th క్లాస్ అర్హతతో పాటు సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ చూపిన సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 జులై 1 వ తారీఖు నాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250/-
ఇతరులు రూ.400/- ఫీజు చెల్లించాలి.

2024 మే 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!