September 10, 2024
AP Govt Jobs

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

1.అకౌంటెంట్ గ్రేడ్-3: 02
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
మొత్తం పోస్టుల సంఖ్య: 04

విద్యార్హతలు:

1.అకౌంటెంట్ గ్రేడ్-3: M.com అర్హతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు MS Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.అకౌంటెంట్ గ్రేడ్-3: రూ.27,000/-
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-

ఎంపిక విధానం:

అకడమిక్ మార్కులు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయం,
1st Floor, AIMs College,
ముమ్మిడివరం- 533216,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 నవంబర్ 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ధ్రువపత్రాల పరిశీలన తేదీ:

2023 నవంబర్ 8,9 తారీకుల్లో ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application for Accountant Gr-3

Application for DEO

Official Website

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!