ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘క్లర్క్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) నుంచి స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డీసీసీబీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులు: 32
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, ఆంగ్ల భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
2023 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.17,900/- నుంచి రూ.47920/- వరకు
ఎంపిక విధానం:
ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మే/జూన్ 2023లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 30వ తారీకు నుంచి 2023 ఏప్రిల్ 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు