September 10, 2024
Police/Defence

10th క్లాస్ అర్హతతో 1,29,929 కానిస్టేబుల్ GD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. CRPF Constable GD Notification 2023

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 4,667 పోస్టులు రిజర్వ్ చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 10% పోస్టులను అగ్నివీర్ అభ్యర్థులకు కేటాయించారు.

CRPF కానిస్టేబుల్ GD ఉద్యోగాలకు. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో రాత పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలవారి జీతం రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా విడుదల చేయలేదు. త్వరలో దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటిస్తారు. CRPF ద్వారా త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది.

పూర్తి వివరాలకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!