September 7, 2024
AP Govt Jobs

AP Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

  1. అంగన్వాడి వర్కర్: 12 పోస్టులు
  2. అంగన్వాడి హెల్పర్: 40 పోస్టులు
  3. మినీ అంగన్వాడి వర్కర్: 04 పోస్టులు
    మొత్తం ఖాళీల సంఖ్య: 56

ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు:

కడప, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు:

అంగన్వాడి వర్కర్ పోస్టులకు పదో తరగతి. అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

2023 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

  1. అంగన్వాడి వర్కర్: 11,500/-
  2. అంగన్వాడి హెల్పర్: 7,000/-
  3. మినీ అంగన్వాడి వర్కర్: 7,000/-

ఎంపిక విధానం:

ఏడో తరగతి, పదవ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 09/05/2023 ఉదయం 11.00 గంటలకు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము.

దరఖాస్తు విధానం:

ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
2023 మే 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను kadapa.ap.giv.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు

Notification & Application

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!