AAI Recruitment 2023: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు
న్యూఢిల్లీ లోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 342 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 09 పోస్టులు
2.సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 09 పోస్టులు
3.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్): 237 పోస్టులు
4.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): 66 పోస్టులు
5.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్): 03 పోస్టులు
6.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా): 18 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 342.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, LLB ఉత్తీర్ణతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 సెప్టెంబర్ 4వ తారీకు నాటికి
1.జూనియర్ అసిస్టెంట్: 30 సంవత్సరాల లోపు
2.సీనియర్ అసిస్టెంట్: 30 సంవత్సరాల లోపు
3.జూనియర్ ఎగ్జిక్యూటివ్: 27 సంవత్సరాల లోపు
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.జూనియర్ అసిస్టెంట్:
నెలకు రూ.31,000/- నుంచి రూ.92,000/- వరకు
2.సీనియర్ అసిస్టెంట్:
నెలకు రూ.36,000/- నుంచి రూ.1,10,000/- వరకు
3.జూనియర్ ఎగ్జిక్యూటివ్:
నెలకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు
దరఖాస్తు ఫీజు:
రూ.1,000/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభ తేదీ:
2023 ఆగస్టు 5వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి