Railway Jobs: 10th క్లాస్ అర్హతతో రైల్వే గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RRB Group-D Recruitment: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ జోన్ లో ఉన్న ఖాళీ పోస్టులకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.10th క్లాస్, ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తీ వివరాలు తెలుసుకుందాం..
▶️Organization Details:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
▶️Vacancies Details:
Level-1 గ్రూప్-D పోస్టులు: 32,000 ఖాళీలు
▶️Education Qualifications:
10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ITI విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
▶️Age limit:
- 2025 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
▶️Salary:
నెలకు రూ.18,000 జీతం ఉంటుంది. జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్ లు ఉంటాయి
▶️Selection Process:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️Apply Process:
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తారీకు నుంచి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▶️Application Fee/ Examination Fee:
- OC, BC, EWS అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
- SC, ST అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.
▶️Important Dates:
23-01-2025 తారీకు నుంచి 22-02-2025 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
▶️Note: జోన్ల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు.. విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్ వివరాలను RRB జనవరి 23 వ తారీకున విడుదల చేసే పూర్తీ నోటిఫికేషన్లో తెలపనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.