TS Govt Jobs 2024 | వచ్చే నెలలో 22వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలోపు 22 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ లోపే రెండు లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
✅అతి తక్కువ ధరలో “TS Group-2,3,4; TS SI/Constable, SSC GD Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలోపు 22 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. శనివారం ఆయన ఓ టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులను రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా కోరానని, వారి రాజీనామాలను గవర్నర్ రాష్ట్రపతికి పంపారని తెలిపారు. అయితే తొలగింపునకు గల కారణాలపై రాష్ట్రపతి కొన్ని విషయాలపై స్పష్టత అడిగారు. ఆ ఫైల్ మళ్లీ గవర్నర్ నుంచి మాకు వచ్చింది. వివరాలన్నీ మళ్లీ పంపిస్తున్నాం. అయితే టీఎస్పీఎస్సీకి చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను నియమించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. ఐదు పదవులు ఖాళీ ఉన్నందున వాటిని ముందుగా భర్తీ చేస్తాం. చైర్మన్ లేకుండా కొత్త నోటిఫికేషన్లు, నియామకాలు చేపట్టలేం. రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించిన వెంటనే కొత్త చైర్మన్‌ను నియవిుంచి ఉద్యోగాల భర్తీ చేపడతాం అని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా 22 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఈ ఏడాది డిసెంబరు లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి