తెలంగాణలో 34,694 వాలంటీర్ పోస్టుల భర్తీ | TS Volunteer Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,694 మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
✅అతి తక్కువ ధరలో “TS Group-2,3,4; TS SI/Constable, SSC GD Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మెరుగైన పరిపాలనకు బూత్ వాలంటీర్ వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను నిజమైన అర్హులకు అందేలా చూడడం, పారదర్శక పాలన వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలను క్షేత్రస్థాయిలో నిర్వర్తించేందుకు 34,694 మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించినట్లు అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించి ప్రకటించే అవకాశం ఉంది.
✅అతి తక్కువ ధరలో “TS Group-2,3,4; TS SI/Constable, SSC GD Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి