AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నెల్లూరు జిల్లా, నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఓటి టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, అనిస్తేషియా టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, పేడియాట్రిక్/ చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, పెర్ఫ్యూషనిస్ట్, బయో మెడికల్ టెక్నీషియన్, డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్, ఓటి అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రెచర్ బేరర్, రేడియోగ్రాఫర్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, CT టెక్నీషియన్, ప్యాకర్స్ (లాండ్రీ), అటెండర్స్, జనరల్ డ్యూటీ అటెండర్.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 అక్టోబర్ 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రిన్సిపాల్ కార్యాలయం,
ACSR ప్రభుత్వ వైద్య కళాశాల,
నెల్లూరు- 524004.
దరఖాస్తు ఫీజు:
OC/BC అభ్యర్థులు రూ.500/-
SC/ST అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 డిసెంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి