APPSC Group-2 | 989 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 989 గ్రూప్-2 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 989 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా రోస్టర్ పాయింట్ల ఖరారులో చేసిన మార్పుల గురించి సాధారణ పరిపాలన శాఖ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు వివరించింది. ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ ప్రకారం, కొత్తగా జారీచేసిన జీఓ 77 ప్రకారం రోస్టర్ పాయింట్ల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు కేటాయించిన నిష్పత్తి ప్రకారం ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లను ఎలా నిర్ధారించాలన్న దానిపై వివరించింది. ఈ విధానం అమలుపై అందజేసిన నమూనా ఆధారంగా వివరాలతో ఈ నెల 29న సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించింది.
రోస్టర్ పాయింట్ల వివరాలు ఆయా శాఖల నుంచి అందిన వెంటనే ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిసెంబర్ రెండో వారం లోపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి