APPC Group-2 | 950 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష
APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్-2 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా గ్రూప్-2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. పది రోజుల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. రోస్టర్ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ ఆదేశించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అది తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి