December 20, 2024
TS Govt Jobs

TS Government Jobs: తెలంగాణ విద్యాశాఖలో 5,089 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)/ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)/ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

పోస్టుల వివరాలు:

డీఎస్సీ/ టీఆర్టీ: 5,089 టీచర్ పోస్టులు

ఖాళీల వివరాలు:

మొత్తం 5,089 ఖాళీల్లో
●ఎస్జీటీ – 2,575 పోస్టులు,
●స్కూల్ అసిస్టెంట్- 1,739 పోస్టులు,
●లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు,
●పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

2023 జూలై 1 వ తారీకు నాటికి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు తేదీలు:

సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీలు:

నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు.

రాతపరీక్ష విధానం:

ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో జరుగుతుంది.

పరీక్ష కేంద్రాలు:

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.

దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

1.ఆదిలాబాద్: 275
2.ఆసిఫాబాద్ : 289
3.భద్రాద్రి కొత్తగూడెం: 185
4.హనుమకొండ: 54
5.హైదరాబాద్: 58
6.జగిత్యాల: 148
7.జనగామ: 76
8.జయశంకర్ భూపాలపల్లి: 74
9.జోగులాంబ: 146
10.కామారెడ్డి: 200
11.కరీంనగర్: 99
12.ఖమ్మం: 195
13.మహబూబాబాద్: 125
14.మహబూబ్ నగర్: 96
15.మంచిర్యాల: 113
16.మెదక్: 147
17.మేడ్చల్: 78
18.ములుగు: 65
19.నాగర్ కర్నూల్: 114
20.నల్గొండ: 219
21.నారాయణపేట: 154
22.నిర్మల్: 115
23.నిజామాబాద్: 309
24.పెద్దపల్లి: 43
25.రాజన్న సిరిసిల్ల: 103
26.రంగారెడ్డి: 196
27.సంగారెడ్డి: 283
28.సిద్దిపేట: 141
29.సూర్యాపేట: 185
30.వికారాబాద్: 191
31.వనపర్తి: 76
32.వరంగల్: 138
33.యాదాద్రి: 99

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!