Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో 3,049 పీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (P.O.)/ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,049 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు రెండు రోజుల్లో ముగియనున్నది. ఆగస్టు 21వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీస్
మొత్తం పోస్టులు: 3,049
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు 1వ తారీకు నాటికి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఆగస్టు 1వ తారీకు నుంచి 2023 ఆగస్టు 21వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.850/- ఫీజు చెల్లించాలి.
SC/ ST/ PwBD అభ్యర్థులు రూ.175/- ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ:
2023 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష తేదీ:
నవంబర్, 2023లో నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
2024 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ప్రిలిమ్స్ పరీక్ష:
అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ పరీక్ష:
గుంటూరు, కర్నూలు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్ లో నిర్వహించనున్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి