TSPSC Group-2:- గ్రూప్-2 పరీక్ష వాయిదా పై సోమవారం లోగా నిర్ణయం: టీఎస్పీఎస్సీ
TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది.
TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదే నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ దశలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్ వినతిపత్రం ఇచ్చినా టీఎస్పీఎస్సీ స్పందించలేదని తెలిపారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు కూడా సిద్ధం చేశారని, ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని వివరించారు. గ్రూప్-2 పరీక్షకు ఐదున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది సుమారు 60 వేల మందేనని చెప్పారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు మే 23న, గురుకుల బోర్డు పరీక్షలకు మార్చిలో నోటిఫికేషన్లు రాగా, వీటన్నింటి కంటే ముందే ఫిబ్రవరిలోనే గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైందని గుర్తు చేశారు. ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్దమవుతుంటే కేవలం 150 మంది మాత్రమే కోర్టుకు వచ్చారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం గురుకుల పరీక్షలు రాస్తున్నది కొందరు అభ్యర్థులే అయినా వారికీ అవకాశం ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై నిర్ణయం ఈ నెల 14లోపు చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తారీకు లోపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తెలిపింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి