TSPSC Group 4 Results 2023: గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన తర్వాత సుమారు వారంరోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో కమిషన్ సమావేశం అవుతుంది. తర్వాత ఫైనల్ ‘కీ’ని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు నెలలోనే పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నది. సెప్టెంబర్ చివరిలోపు తుది ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారంతోనే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇతర ప్రక్రియను వేగవంతం చేయనున్నది. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు దాదాపు 93 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి