TSPSC Group 4: తెలంగాణ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ #1 (ప్రశ్నలు – జవాబులు)
1).బీ.ఆర్ అంబేద్కర్ ఎన్నవ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు?
132వ జయంతి
2).హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి జీవం పోసింది ఎవరు?
రామ్ వాంజీ సుతార్
3).హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్ని అడుగుల ఎత్తైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆవిష్కరించారు?
125 అడుగులు
4).తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఏ. శాంతకుమారి
5).జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో తెలంగాణకు ఎన్నో ర్యాంకు దక్కింది?
5వ ర్యాంకు
6).తెలంగాణలో 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు?
రూ.2,90,396 కోట్లతో
7).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 బడ్జెట్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ.32,019 కోట్లు కేటాయించింది. అయితే కేవలం వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు ప్రతిపాదించింది?
రూ.26,831 కోట్లు
8).తెలంగాణ రాష్ట్రంలో 2023వ సంవత్సరంలో ఎన్ని వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నారు?
రూ.90 వేల లోపు
9).తెలంగాణ రాష్ట్రంలో 2015 – 2021 మధ్య అటవీ విస్తీర్ణం ఎంత శాతం పెరిగింది?
6.85%
10).2023 – 24 లో (ప్రస్తుత ధరల ప్రకారం) తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) సుమారుగా ఎన్ని లక్షల కోట్లుగా అంచనా వేయబడింది?
రూ.14 లక్షల కోట్లు
11).దేశ వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు ఎంత శాతంగా ఉంది?
7.4 శాతం
12).హైదరాబాదులో ఇటీవల ఆవిష్కరించిన 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహం బరువు ఎంత?
465 టన్నులు
13).ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కలిపి ఎన్ని కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
21 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
14).కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో భాగంగా పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2022 అవార్డులలో తెలంగాణ ఎన్ని పురస్కారాలను కైవసం చేసుకుంది?
16 పురస్కారాలను
15).తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ లో నీటిపారుదల రంగానికి ఎన్ని కోట్లు ప్రతిపాదించారు?
రూ.26,885 కోట్లు