తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ కం డీఈఓ, మెడికల్ ఆఫీసర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
- ఏఎన్ఎం: 01
- పీడియాట్రీషియన్: 01
- సైకాలజిస్ట్: 01
- మెడికల్ ఆఫీసర్: 01
- మేనేజర్: 01
- మెడికల్ ఆఫీసర్ (ఆయుష్): 04
- ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 01
- స్పీచ్ థెరపిస్ట్: 01
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్: 01
- అకౌంటెంట్ కం డీఈవో: 03
- బయో కెమిస్ట్: 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
మొత్తం పోస్టులు: 19
వయోపరిమితి:
18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి డిగ్రీ, డిఫార్మసీ, MPHW, ఎంబీబీఎస్, ఎండి, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 8వ తారీకు నుంచి 2023 మార్చి 13వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులను ఖమ్మంలోని DMHO కార్యాలయానికి పంపించాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు