LIC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 300
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 15వ తేదీ నుంచి 2023 జనవరి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.licindia.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జనవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
రూ.53,600/- నుంచి 1,02,090/- వరకు
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: 17.02.2023 & 20.02.2023
మెయిన్ పరీక్ష: 18.03.2023
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు