TS Govt Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా అర్హతతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 పోస్టు
- ఎలక్ట్రీషియన్: 01 పోస్టు
- హౌస్ కీపర్: 02 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్: 03 పోస్టులు
- రికార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు
- క్లీనర్స్: 02 పోస్టులు
- లైబ్రరీ అటెండెంట్: 02 పోస్టులు
- డ్రైవర్: 01 పోస్టు
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


వయోపరిమితి
01-01-2026 తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫర్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు.
దరఖాస్తు తేదీలు
27-01-2026 తేదీ నుంచి 05-02-206 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

