APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానిక్ ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 7,673 ఖాళీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది.
7673 పోస్టులలో కండక్టర్ 1813 పోస్టులు, డ్రైవర్ 3673 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి కోరింది వీటితోపాటు శ్రామిక్ మెకానికల్ తదితర పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
APSRTC Recruitment 2026
విద్యార్హతలు
- కండక్టర్ పోస్టులు: 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు
- డ్రైవర్ పోస్టులు: 10వ తరగతి అర్హతతో పాటు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు
- శ్రామిక్ పోస్టులు: 10వ తరగతి అర్హతతో పాటు ITI (డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్..) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు
- మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు: డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. (లేదా) బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ మెకానిక్ ఎలా ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు
వయోపరిమితి
పోస్టులను అనుసరించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు.
ఎంపిక విధానం
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
