AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పోస్టులు భడితే నోటిఫికేషన్ విడుదల చేశారు 7వ తరగతి, 10వ తరగతి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
AP Anganwadi Jobs 2026
పోస్టుల వివరాలు
కర్నూలు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 64 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- అంగన్వాడీ కార్యకర్త: 08 పోస్టులు
- మినీ అంగన్వాడీ కార్యకర్త: 02 పోస్టులు
- హెల్పర్: 54 పోస్టులు
విద్యార్హతలు
అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 10వ తరగతి విద్యారహత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు
- అంగన్వాడీ కార్యకర్త: రూ.11,500/-
- అంగన్వాడీ మినీ కార్యకర్త: రూ.7,000/-
- అంగన్వాడీ హెల్పర్: రూ.7,000/-
సెలక్షన్ ప్రాసెస్
విద్యార్హతలో సాధించిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో పొంది తిరిగి అదే ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు పదవ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరణ చేసి సమర్పించవలెను. మరిన్ని వివరాలకు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించగలరు.
దరఖాస్తు చివరి తేదీ
అర్హత గల అభ్యర్థులు తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
