Telangana Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 859 ఉద్యోగాలు భర్తీకి 9 రకాల నోటిఫికేషన్లు విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, కాపీఇస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆఫీసు సబర్డినేట్, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్, కాపీఈస్ట్, ఎగ్జామినర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 46 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
