AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జనరల్ డ్యూటీ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రేచర్ బేరర్, MNO, FNO పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
AP Outsourcing Jobs Notification 2026
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రేచర్ బేరర్, MNO, FNO పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 24 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- జనరల్ డ్యూటీ అటెండెంట్: 06 పోస్టులు
- నర్సింగ్ ఆర్దర్లీ: 02 పోస్టులు
- స్ట్రేచర్ బేరర్: 06 పోస్టులు
- MNO: 05 పోస్టులు
- FNO: 05 పోస్టులు
విద్యార్హతలు
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
- నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రేచర్ బేరర్, MNO, FNO పోస్టులకు 10వ తరగతి అర్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ కోర్స్ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
01-01-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.15000/- ఉంటుంది.
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు
- OC, BC అభ్యర్థులు: రూ.300/-
- SC, ST అభ్యర్థులు: రూ.200/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 22-01-2026 తేదీ నుంచి 31-01-2026 తేదీలోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
