Mega Job Mela in Telangana
Mega Job Mela: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో రేపు (24-01-2026) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 60 కి పైగా కార్పొరేట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, ఎం.టెక్, ఎంఎస్సీ, ఎం.కామ్, ఎంబీఏ, ఎంసీఏ అర్హతలు కలిగిన అభ్యర్థుల జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళా సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Mega Job Mela నిర్వహిస్తున్న సంస్థ
శాతవాహన వర్సిటీ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది
Mega Job mela కంపెనీల వివరాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన 60 కి పైగా కార్పొరేట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయి.
పోస్టుల వివరాలు
ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కంపెనీల్లో 5,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, ఎం.టెక్, ఎంఎస్సీ, ఎం.కామ్, ఎంబీఏ, ఎంసీఏ అర్హతలు కలిగిన అభ్యర్థుల జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం సంవత్సరానికి కనీసం రూ.1,20,000 నుంచి గరిష్టంగా రూ.4,50,000 వరకు ఉంటుంది.
Mega Job Mela నిర్వహణ ప్రదేశం
కరీంనగర్ జిల్లా, శాతవాహన యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు .
జాబ్ మేళా నిర్వహణ తేదీ
24-01-2026 తేదీ ఉదయం 9 గంటలకు శాతవాహన యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలతో హాజరు కావలెను.
