TSPSC: గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 8,180 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్-4 ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1న పరీక్ష నిర్వహించారు. ఈ ఉద్యోగాల కోసం 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 7,62,872 మంది పేపర్-1 పరీక్షకు.. 7,61,198 మంది పేపర్-2 పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80.02% మంది పరీక్ష రాశారు.
గ్రూప్-4 ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించే మార్కులను ప్రకటించనున్నారు. ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ పోస్టుకు అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి, తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత 2 నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే లోపు గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తీ చేసే అవకాశం ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి