TSPSC: గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఒక్కో పోస్టుకు 387 మంది పోటీ
TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 387 మంది పోటీ పడుతున్నారు.
గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.