TSPSC: ఈ వారంలో గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యేనా?
TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? షెడ్యూల్ ప్రకారం జరిగితే ఈ వారంలో హాల్ టికెట్లు విడుదలవుతాయా? లేక మరోసారి పరీక్షలు వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? షెడ్యూల్ ప్రకారం జరిగితే ఈ వారంలో హాల్ టికెట్లు విడుదలవుతాయా? లేక మరోసారి పరీక్షలు వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. 2024 జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా? యధావిధిగా నిర్వహిస్తారా? అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఒకవేళ జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు జరిగితే, పరీక్షలకు సరిగ్గా వారం రోజులు ముందుగా హాల్ టికెట్లు విడుదల చేయాలి. అంటే డిసెంబర్ చివరి లోపు హాల్ టికెట్లు విడుదల చేయాలి. కానీ పరీక్షల నిర్వహణ పై టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్-2 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది నిరుద్యోగులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి