TSPSC Group-2 Hall Tickets 2023: తెలంగాణ గ్రూప్-2 హాల్ టిక్కెట్ అప్డేట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 29, 30 తారీకుల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆఫ్ లైన్ పద్ధతిలో ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సరిగ్గా వారం రోజుల ముందుగా విడుదల చేయనున్నారు. అంటే ఆగస్టు 22వ తారీకున హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది.

గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్పీఎస్సీ ని ఆశ్రయించారు. అలాగే షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు టీఎస్పీఎస్సీ ని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొందరు శాసనసభ సభ్యులు సైతం గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారు సిఎస్ శాంతకుమారి గారితో చర్చించారు. అన్ని పరిశీలించిన తర్వాత గ్రూప్-2 పరీక్ష యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని సీఎం ప్రకటించారు.

Telangana TET Results 2026
Telangana TET Results 2026 – తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే 30వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

TS Anganwadi Recruitment 2026
TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Khammam Job Mela 2026
Khammam Job Mela 2026 – ఏదైనా డిగ్రీ అర్హతతో ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!