TS District Court Record Assistant Jobs
TS District Court Record Assistant Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 10 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 36 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
Age limit
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.22,240 నుంచి రూ.67,300 వరకు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష నూరు మార్కులకు నిర్వహిస్తారు. నూరు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
Apply Process
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .
Application Fee
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు తేదీలు
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

