TG SPDCL Recruitment 2025 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల
TG SPDCL Recruitment 2025
తెలంగాణ రాష్ట్ర దక్షిణ డిస్కం (ఎస్పీడీసీఎల్) పరిధిలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు, 30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ/ బీటెక్, సబ్ ఇంజనీర్ పోస్టులకు డిప్లొమా, జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
TG SPDCL JLM Eligibility Criteria
జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు మొత్తం 1650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఐటిఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ పూర్తి అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలను రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష పూర్తి అయిన తర్వాత పోల్ క్లైమ్బింగ్ టెస్ట్, మీటర్ రీడింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు. వీటన్నిటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగం లభిస్తుంది.
TG SPDCL AE Eligibility Criteria
తెలంగాణ ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 45 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు బీఈ/ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
TG SPDCL Sub Engineer Eligibility Criteria
తెలంగాణ ఎస్పీడీసీఎల్ పరిధిలో 30 సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
✅తెలంగాణ SI/ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రామపాలన ఆఫీసర్, SSC MTS/ Havaldar, SSC CGL, CHSL ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం 499 అందించడం జరుగుతుంది క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి