TS Police Jobs: తెలంగాణ పోలీసు శాఖలో 24,247 ఉద్యోగాలు
TS Police Jobs: తెలంగాణ పోలీసు శాఖలో 24,247 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ప్రతి 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు తెలిపింది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై తాజా నివేదిక వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. వీటిలో ఎస్సై పోస్టులు 3832 మందికి గాను 2997 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అలాగే కానిస్టేబుల్ పోస్టులు 32,747 మందికి గాను 22,161 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇలా పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను తెలిపింది. మొత్తంగా 24,247 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పోలీస్ శాఖలో కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.