TS Outsourcing Jobs: రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ మరియు పిల్లల సహాయ కేంద్రం, రైల్వే స్టేషన్, ఖమ్మం నందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2.కౌన్సెలర్: 01 పోస్టు
3.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 06 పోస్టులు
4.కేస్ వర్కర్: 06 పోస్టులు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు: రూ.28,000;
కౌన్సెలర్ పోస్టులకు: రూ.18,536;
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులకు: రూ.19,500;
కేస్ వర్కర్ పోస్టులకు: రూ.15,600.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి,
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ,
ఖమ్మం వారి కార్యాలయం,
ఐ.డి.ఓ.సి-S-31.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2023 జూలై 20వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి