December 6, 2024
TS Govt Jobs

Telangana Jobs: తెలంగాణలోని 8 వైద్య కళాశాలల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోషణ భర్తీకి అనుమతులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 వైద్య కళాశాలలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు గతంలోనే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (IHFMS) విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విభాగం క్రింద ములుగు, నారాయణపేట, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మెదక్, మహేశ్వరం, నర్సంపేట వైద్య కళాశాలలో పారిశుధ్య సిబ్బంది నియామకం చేపట్టవచ్చని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి

Join Our Whatsapp Group

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!