Telangana District Court Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జ్యుడీషియల్ మినీస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగం నుంచి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 319 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 24 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
తెలంగాణ జ్యుడీషియల్ మినీస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 319 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు
7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
Age ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి తేదీ నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్య అభ్యర్థులకు జీతం నెలకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 45 మార్కులకు, ఇంటర్వ్యూ ఐదు మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు
ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి; ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు తేదీలు
24-01-2026 తేదీ నుంచి 13-02-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
