10th క్లాస్ అర్హతతో 8,326 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | కానిస్టేబుల్ తరహా పోస్టులు భర్తీ | SSC MTS Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th క్లాస్ అర్హతతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటిఎస్ మరియు హవాల్దార్ (కానిస్టేబుల్ తరహా పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

MTS: 4,887 పోస్టులు

హవాల్దార్: 3,439 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 8,326

👉విద్యార్హతలు: 

10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

👉వయోపరిమితి: 

MTS పోస్టులకు 18 నుంచి 25, హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం:

MTS పోస్టులకు రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హవాల్దార్ పోస్టులకు రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 పరీక్ష విధానం:

ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు భాషలోనూ పరీక్ష నిర్వహిస్తారు.

👉AP, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు:

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

👉దరఖాస్తు విధానం: 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

జనరల్/ బీసీ అభ్యర్థులకు: రూ.100/-

ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Official Website

✅నిరుద్యోగుల కోసం: SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!