TS Govt Jobs 2023: సింగరేణిలో 558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిం చారు. 277 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు: 30
మేనేజ్ మెంట్ ట్రైనీలు మైనింగ్: 79
ఎలక్ట్రికల్, మెకానికల్: 66
సివిల్ విభాగంలో: 18
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్: 10
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 18
ఐటీ విభాగంలో: 7
హైడ్రోజియాలజిస్ట్: 2
పర్సనల్ విభాగంలో: 22
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్: 3
జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్: 10
సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్): 16 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.