50 వేల జీతంతో తెలంగాణ సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TS Singareni Jobs Notification 2024
Singareni Notification 2024: కొత్తగూడెం లోని సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 272 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్తగూడెం లోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్): 139 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ & ఏ): 22 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్): 22 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ): 10 పోస్టులు
జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్: 10 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో-జియాలజిస్ట్): 02 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్): 18 పోస్టులు
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్: 03 పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 30 పోస్టులు
సబ్-ఓవర్సీర్ ట్రైనీ(సివిల్): 16 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 272
వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మాత్రం 45 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ / బీఎస్సీ(ఇంజినీరింగ్), సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
పోస్టును అనుసరించి రూ.40,000/- నుంచి రూ.1,20,000/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 1వ తారీకు నుంచి సింగరేణి వెబ్సైట్ https://scclmines.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 18వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.