RRB: రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,238 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఖాళీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం, వివరాలు తెలుసుకుందాం..
👉 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6,238 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 183 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-3: 6,055 పోస్టులు
👉 వయోపరిమితి:
01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి+ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 జీతభత్యాలు:
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: రూ.29,200
టెక్నీషియన్ గ్రేడ్-3: రూ.19,900
👉 ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28-07-2025 తేదీ నుంచి 28-07-2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు:
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు 250; ఓసి, బీసీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅RRB Group-D, SSC MTS & Havaldar, SSC CGL ఆన్లైన్ కోర్స్ కేవలం రూ.499 కే అందిస్తున్నాం. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావాల్సిన తీసుకోండి.
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి