RRB: ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో 3,058 క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RRB NTPC: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 3,058 క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ జోన్లో 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్ 27వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,424 పోస్టులు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు
- ట్రైన్స్ క్లర్క్: 77 పోస్టులు
విద్యార్హతలు
ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి
శ్రీ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
పోస్టును అనుసరించి రూ.19,900 నుంచి రూ.21,700 వరకు జీతం ఉంటుంది.
ఎంపికవిధానం
స్టేజ్-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 2025 నవంబర్ 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు
రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.

